గత కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీమ్’ సక్సస్ మీట్ కు అతిధిగా వచ్చి వర్మగొప్పతనాన్ని మెచ్చుకుని దాసరి సంచలనం చేసారు. ఈ సక్సస్ మీట్ జరిగి కొద్ది రోజులు కూడ గడవ కుండానే రామ్ గోపాల్ వర్మకు తన ట్విట్ ద్వారా సంఘీభావాన్నిటాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెలియచేసి మరో షాక్ ఇచ్చాడు. రాజమౌళి తన మాటలలో ‘ఐస్ క్రీమ్’ గురించి విభిన్నంగా స్పందించాడు. ‘ఐస్ క్రీమ్ చిత్రాన్ని కంటెంట్ పరంగా ఉదాహరణగా తీసుకోవద్దు కేవలం వర్కింగ్ మోడల్ మాత్రమే తీసుకోండి .’ అని అంటున్నాడు టాలీవుడ్ జక్కన్న. గత వారం విడుదల అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా విమర్శకుల చేత కూడ విపరీతంగా టార్గెట్ చేయబడ్డ ఈ సినిమాను ఒక వైపు దాసరి మరొక వైపు రాజమౌళి తమ భుజాల పై ఎత్తుకుని ప్రమోట్ చేయడం బట్టి నిజంగా రామ్ గోపాల్ వర్మకు ఒక సూపర్ సక్సస్ వచ్చినట్లే అనుకోవాలి. అంతేకాకుండా రాజమౌళి మరో అడుగు ముందుకు వేసి వర్మ తన సినిమాలకు పెట్టె టైటిల్స్ కూడ చాల బాగుంటాయి అని ప్రశంసించారు. ఇద్దరు ప్రముఖ దర్శకుల సపోర్ట్ దొరికింది కాబట్టి ఇక వర్మ తన సినిమాలతో మరింత రెచ్చిపోతాడు అనుకోవాలి. ఇప్పటికే వర్మ సినిమాలు ఎలా తీయాలి అన్న విషయం పై యూట్యూబ్ లో లెక్చర్లు ఇస్తున్న నేపధ్యంలో రాజమౌళి ఇచ్చిన ఉత్సాహంతో ఇంకా ఎన్ని ప్రయోగాలు చేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: