బూతు సినిమాలు తీస్తూ అదేవిధంగా బూతు సినిమాలకు డైలాగ్స్ రాస్తూ చాలామంది రచయితలు, దర్శకులు డబ్బును పోగు చేసుకుంటూ ఉంటే తనకు బూతు డైలాగ్స్ మరియు బూతు సినిమాలు తనకు అచ్చి రాలేదని ఒక దర్శకుడు చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. టాలీవుడ్ లో అందరిచేత డార్లింగ్ స్వామిగా పిలుపించుకునే మాటల రచయిత స్వామి ‘డార్లింగ్’ సినిమా నుండి గుర్తింపులోకి వచ్చాడు. ఇతడు దర్శకుడిగా మారి బూతు కంటెంట్ బాగా దట్టించి తీసిన ‘రొమాన్స్’ సినిమా ఏమాత్రం విజయవంతం కాలేదు. ఈ సినిమాను మారుతి పేరు పై ప్రమోట్ చేసినా ఫలితం దక్కలేదు.  కోన వెంకట్ దగ్గర తాను పది సినిమాలకు డైలాగ్ రైటింగ్ విషయంలో సహాయకుడిగా పనిచేసినా బూతు డైలాగ్స్ రాయడం తనకు రాలేదు అంటూ ఒక విచిత్ర కామెంట్ విసిరాడు ఈ ‘మనం’ డైలాగ్స్ రచయిత. ఇటీవల విడుదల అయి సూపర్ హిట్ అయిన ‘మనం’ సినిమాకు డైలాగ్స్ రచయితగా పనిచేసిన ఈ డార్లింగ్ స్వామి తనకు మాటల రచయితగా ‘మనం’ సినిమాలో వచ్చిన పేరుకు పొంగిపోతూ మంచి జోష్ తో ఉన్న ఈ దర్శకుడు ప్రస్తుతం సినిమాలలో వస్తున్న బూతు డైలాగ్స్ పై ఇలాంటి వెరైటీ కామెంట్స్ చేసాడు. మరి డార్లింగ్ స్వామి చెపుతున్నట్లుగా బూతు డైలాగ్స్ కు ఈ రచయిత భవిష్యత్ లో ఎంత వరకు దూరంగా ఉంటాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: