తెలుగు తెర సీతమ్మ అంజలి తనకు తానే ‘గీతాంజలి’ సినిమాకు గిప్ట్ గా మారింది అంటూ కోన వెంకట్ తన ఫేస్ బుక్ లో అంజలి ఒక సరికొత్త BMW కారు పక్కన నుంచుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి కలకలం సృష్టిస్తున్నాడు ఈ విలక్షణ రచయిత. ఈ ఫోటోను చూసిన చాలామంది అంజలి తన సొంతంగా ఇంత ఖరీదైన కారును కొనుక్కున్నదా లేదంటే ఎవరైనా అజ్ఞాత వ్యక్తి ఆమెకు ఈ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారా అనే విషయం పై అప్పుడే రకరకాల కధలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అంజలి నటించిన ‘గీతాంజలి’ సినిమా బిజినెస్ అనుకున్న దానికన్నా బాగా జరగడంతో ఆ సినిమా నిర్మాతలు అంజలికి ఈ కారును బహుమతిగా ఇచ్చి ఉంటారు అని కొందరు ఊహిస్తూ ఉంటే మరికొందరు ప్రస్తుతం అంజలికి గాడ్ ఫాదర్ లా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ నిర్మాత అంజలికి ఈ విలువైన బహుమతి ఇచ్చి ఉంటాడు అని గాసిప్పులు మొదలయ్యాయి. ‘సీతమ్మ’ సినిమా తరువాత అంజలి నటించిన సినిమాలు పరాజయం చెందడం అంతేకాకుండా ఆమె వ్యక్తిగత సమస్యల మధ్య కూరుకు పోవడంతో అంజలి హవా అయిపోయింది అనుకున్నారు అంతా. అయితే అందరిఅంచనాలను తలక్రిందులు చేస్తూ ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాగా ‘గీతాంజలి’ ని చేస్తూ ఈ రాజోలు అమ్మాయి పవర్ ను చూపెడుతోంది. ఏమైనా అంజలి లేటెస్ట్ గిఫ్ట్ టాలీవుడ్ గాసిప్స్ కు సంచలనంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: