ఎన్నికలు తరువాత ఏ విషయం పైనా స్పందించని పవన్ కళ్యాణ్ ఈరోజు తన మౌనాన్ని వీడి చిన్నారుల కుటుంబాలను ఓదార్చడానికి జనం మధ్యకు వచ్చాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు కాకతీయ విద్యాలయం బస్సును ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడం పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించాడు. ఆయన యశోద ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని అభిప్రాయపడ్డాడు పవన్. పలువురు విద్యార్థులు చావుబతుకులతో పోరాడుతూ ఉంటె తన మనసు తీవ్రంగా గాయపడింది అంటూ ఈ ఘటన నుండి ప్రభుత్వాలు పాఠం నేర్చుకోవాలన్నారు పవన్. అంతేకాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సమస్యల పైన దృష్టి సారించాలి అన్నాడు పవన్. ఈరోజు జరిగిన ప్రమాదం వంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలు వేయాలని అంటూ ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారులకు తన ప్రఘాడ సానుభూతిని తెలియచేసాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: