టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరోల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటే దానికి సమాధానం కచ్ఛితంగా చెప్పలేం. అలాగని వీరి మధ్య ఎటువంటి కోల్డ్ వార్ లేదని కూడ చెప్పలేము. రీసెంట్ గా టాలీవుడ్ అప్ కమింగ్ మెగా హీరో ఓ సమస్యలో చిక్కుకున్నాడు. దాని నుండి బయటపడటానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సంప్రదించినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిన ఈ న్యూస్ ని … ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఎలక్షన్స్ అనంతరం మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరంగానే ఉంటున్నాడు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సంభాషణలు తగ్గించాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మెగా హీరో వరుణ్ తేజ్, తన అప్ కమింగ్ ఫిల్మ్ గొల్లభామ మూవీకి సంబందించిన టైటిల్ కాంట్రవర్సీగా మారే అవకాశాలు ఉన్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు చెబుతున్నారు. గొల్లభామ అనే టైటిల్ బలహీన వర్గాల స్త్రీలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని, అందుకే ఆ టైటిల్ ని మార్చుకుంటే మంచిదని అంటున్నారు. ఈ విషయంలో వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ సలహాను తీసుకునే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు. గోల్లభామ టైటిల్ మార్పు ఖాయమైతే ఏ టైటిల్ పెడితే బాగుంటుంది అనే దానిపై పవన్ సలహా కావాలని వరుణ్ కోరాడంట. అందుకు పవన్ కళ్యాణ్ సైతం వరుణ్ తేజ్ కి ఓ టైటిల్ ని సూచించినట్టుగా తెలుస్తుంది. వరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ ముకుంద అని అంటున్నారు. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే ఉంటుందని టాలీవుడ్ టాక్. కేవలం టైటిల్ మార్పు కోసం పవన్ కళ్యాణ్ ని వరుణ్ తేజ్ సంప్రదించడం అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి వరుణ్ తేజ్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోరుకుంటూనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: