బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొసారి సల్మాన్ ఖాన్ తన స్టార్ డం ని చూపుతున్నాడు. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన కిక్ మూవీ సిల్వర్ స్క్రీన్స్ ని హిట్ చేసింది. జులై 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసిన కిక్ మూవీ అధ్భుతమైన ఓపెనింగ్స్ ని సంపాదించింది. ఇండియాలో 4,500 ధియోటర్స్ లో రిలీజ్ అయిన కిక్ మూవీ, ఓవర్సీస్ లోనూ దాదాపు 800 ధియోటర్స్ లో రిలీజ్ అయింది. అయితే కిక్ మూవీ మొదటి రోజు అన్ని ధియోటర్స్ దాదాపు తొంభై అయిదు శాతం వరకు ఆక్యుపెన్సీని చూసించింది. దీంతో బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్ ని క్రియోట్ చేసింది. డొమెస్టిక్ మార్కెట్ లో కిక్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 27 కోట్ల రూపాయలుగా తేలింది. దీనికి సంబంధించిన లెక్కలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే రెండో రోజు శనివారం కూడ కిక్ మూవీ తొంభై అయితే శాతం పైగా ఆక్యుపెన్సీని సంపాదిందిచుకుంది. దీంతో రోండో రోజు డొమెస్టిక్ మార్కెట్ కలెక్షన్స్ 30 కోట్ల రూపాయలకు చేరుకుందని బాక్సాపీస్ ట్రేడ్స్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా కిక్ మూవీ రెండు రోజుల బాక్సాపీస్ లెక్కలు వేసుకుంటే దాదాను 55 కోట్ల రూపాయల మార్క్ ని చేరుకుంటుందని అంటున్నారు. అయితే వీటికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు వెలువడనుంది. ఈద్ ఫెస్టివల్ సందర్భంగా కిక్ మూవీ రిలీజ్ కావడంతో చాలా మంది ఈ మూవీని చూడటం జరుగుతుంది. భారీ కలెక్షన్స్ కి ఇది కూడ ప్లస్ అయిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: