పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు రాజకీయ ప్రక్షాళనపై చూపిన ఆసక్తి, తరువాత చూపించడం లేదనేది చాలా మంది వాదన. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి డైరెక్ట్ గా రాకుండా తనకంటూ ఓ పార్టీని పెట్టి మరీ, వేరొక పార్టీకి సపోర్ట్ చేయడంతో అందరిలోనూ పవన్ వైఖరి ఆశ్ఛర్యంగా కనిపించింది. తను నిజమైన నాయకుడు అంటూ కొందరి పొగడ్తలు కురిపిస్తే, కొందరు మాత్రం తెలివితక్కువ రాజకీయం అంటూ పవన్ ని టార్గెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ తరువాత రాజకీయాలకి దూరంగా ఉంటూ తన సినిమాలు తను చేసుకుంటున్నాడు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆ మాటలకు సమాధానం చెప్పబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ని ఇవ్వబోతున్నాడు. ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు నిలదీయటానికి ప్రశ్నించే పార్టీగా జనసేన ఉందని చెప్పుకున్న పవన్ కళ్యాణ్, టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మెడలు వంచి పనిచేయిస్తాం అంటూ ఆనాడు పవన్ కళ్యాణ్ స్వీచ్ ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబుని చేస్తున్న పరిపాలని నిశితంగా పరీశిలిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే చంద్రాబాబుపై మొదటి కౌంటర్ వేసే సమయం ఆసన్నమైందని పవన్ సన్నిహితుల వద్ద నుండి అందుతున్న సమాచారం. మొత్తంగా పవన్ కళ్యాన్ త్వరలోనే ప్లాన్ చేసుకుంటున్న పొలిటికల్ స్పీచ్ లో ఏం మాట్లాడాతాడు అనేదానిపై పలువురిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం పవన్ గోపాలా గోపాలా మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: