మాయలేడిగా పేరు పొందిన సమంత తెలివితేటలు ముందు ఏ టాప్ హీరోయిన్ కూడ సరితూగలేదు. అదృష్టం కలిసి రావడంతో ఆమె నటించిన సినిమాలు వరస పెట్టి విజయాలు సాధిస్తూ ఉండటంతో టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అయితే ఈమధ్య సమంత తన దృష్టిని టాలీవుడ్ కన్నా కోలీవుడ్ పైనే ఎక్కువ పెడుతోంది. దీనికి కారణం ఆమె ప్రియ స్నేహితుడు సిద్దార్ధ్ అనే మాటలు కూడ ఉన్నాయి. అయితే సిద్ధార్ధకు కోలీవుడ్ లో నటిస్తున్న సినిమాలు కూడ కలిసి రావడం లేదు. అంతేకాదు సిద్దూ ఈమధ్య తమిళ నిర్మాతలతో తన నోటి దురుసుతో వివాదాలలోకి దిగుతూ ఉండటంతో తమిళనాడు నిర్మాతల మండలి సిద్ధార్ద్ ‘జిగర్తండ’ సినిమా నిర్మాతతో పెట్టుకున్న వివాదం పై తమిళ నిర్మాతల మండలి సిద్దార్ధకు గట్టి వార్నింగ్ ఇచ్చారు అనే వార్తలు కూడ వస్తున్నాయి. ఇదే సినిమాను తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో డబ్ చేసినా ఆ సినిమా వంక ఒక బయ్యర్ దృష్టి కూడ పడక పోవడంతో సిద్ధూ కెరియర్ టాలీవుడ్ లో అయిపోయింది అని అనుకున్నారు అంతా. అయితే ఏమి మాయ చేసిందో తెలియదు కాని దిల్ రాజ్, పొట్లూరి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బెంగుళూరు డేస్’ తెలుగు సినిమా రీమేక్ లో నాగచైతన్య, ఆర్యాలతో పాటు సిద్ధూకు ఈ సినిమాలో ఒక హీరో పాత్ర లభించడంలో సమంత తన తెలివి తేటలను ప్రయోగించడమే కాకుండా కేవలం సిద్ధూ కోసమే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది అనే వార్తలు వస్తున్నాయి. సమంత ట్విస్ట్ ఎంత వరకు ఉపయోగ పడుతుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: