టలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ రుద్రమదేవి. ఈ మూవీలో టాలీవుడ్ కి చెందినన భారీ కాస్టింగ్ ఉంది. అయితే అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తే, అందులోని కీలక పాత్ర అయిన గోన గన్నా రెడ్డి పాత్రను మెగా హీరో అల్లుఅర్జున్ చేస్తున్నాడు. గత కొద్ది వారాలుగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రేసుగుర్రం మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత రుద్రమదేవి మూవీ కోసం అల్లుఅర్జున్ చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు. తన ఫిజిన్ ని ఈ మూవీ కోసం పూర్తిగా మార్చుకున్నాడు. గోన గన్నారెడ్డి పాత్ర కోసం హార్స్ రైడింగ్, కత్తి యుద్ధం వంటి అంశాలలో అల్లు అర్జున్ ట్రైనింగ్ తీసుకున్నాడు. చాలా మంది అల్లు అర్జున్ పోషిస్తున్న రోల్ తన ఫిల్మ్ కెరీర్లోనే అతి ముఖ్యమైన పాత్రలలో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేశాడు. ‘రుద్రమదేవి’ షూటింగ్ కోసం అల్లు అర్జున్ మొత్తంగా 40 రోజుల పాటు కేటాయించాడు. అల్లు అర్జున్ ఒక మూవీకి దాదాపు 2 నెలల కాల్షీట్స్ ని ఇస్తాడు. రుద్రమదేవి చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న మూవీ కావటంతో, క్వాలిటి అవుట్ పుట్ కోసం తన కాల్టీట్స్ ని ఎక్కువ రోజులు కేటాయించాడు. అయితే ఇన్ని రోజులూ తను సింగల్ షెడ్యూల్లోనే పాల్గొని షూటింగ్ ని పూర్తి చేశాడు. అల్లు అర్జున్ సరసన అనామికా దేవి పాత్రలో కేథరిన్ నటిస్తుంది. మరో వారం రోజులు పాటు అల్లుఅర్జున్ రెస్ట్ తీసుకొని తన అప్ కమింగ్ ఫిల్మ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కాస్టింగ్, ఇతర టెక్నిషియన్స్ డిటైల్స్ త్వరలోనే బయటకు వెల్లడికానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: