సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేసుకుంటూ తెగ బిజిగా ఉంటున్న సమంత, నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుత సమయంలో సమంత అంటే క్యూ కట్టే హీరోలు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్ లో యంగ్ హీరోల నుండి ముదురు హీరోల వరకూ ఉన్నారు. అయితే తాజాగా కోలీవుడ్ కి చెందిన స్టార్ హీరో విజయ్, సమంతకి నచ్చే సూపర్ గిప్ట్ ని ఇచ్చాడంట. ప్రస్తుతం ఇదే టాపిక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. గత కొద్ది కాలంగా సమంత తన మూవీల స్వీడుని పెంచింది. తాజాగా సమంత, సూర్యాతో కలసి నటించిన 'అంజాన్' చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా, వెంటనే విజయ్ తో కలసి కత్తి చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. కత్తి మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగష్టు 10కి పూర్తవుతుంది. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ గావుంది. ఈ పాటలను యూరప్ లోని అందమైన లొకేషన్లలో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం చిత్ర యూనిట్ త్వరలోనే యూరప్ వెళ్ళనున్నారు. ఇదిలా ఉంటే విజయ్, సమంతకి కారుని గిప్ట్ గా కొనిచ్చిట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి. 30 లక్షల ఖరీదైన కారుని సమంతకి, విజయ్ గిప్ట్ గా ఇవ్వడంతో వీరిద్దరి రిలేషన్ పై పలు అనుమానాలు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మొత్తానికి విజయ్ ఇచ్చిన గిప్ట్ ని తీసుకున్న సమంత తెగ సంతోషంగా ఫీలవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: