టాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి, రాజశేఖర్ ల టాపిక్ హాట్ హాట్ గా వినిపిస్తుంది. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రంలో మెయిన్ విలన్ గా రాజశేఖర్ ని తీసుకుంటున్నారనే టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలతో అంతగా బిజిగా లేకపోవడంతో తన 150వ చిత్రానికి సంబంధించిన పనుల్లో బిజిబిజిగా ఉన్నాడు. చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా తన నటింబోతున్న 150వ చిత్రం యొక్క డిటైల్స్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడు. అందురూ మందుగా ఊహించినట్టుగా వినాయక్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. దీంతో చిరంజీవి అనౌన్స్ చేయబోతున్న డేట్ త్వరలోనే ఉండటంతో ఈ మూవీలోకి కాస్టింగ్ గురించిన వివరాలపై ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. చిరంజీవి 150వ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎంతో ముఖ్యమైనదిగా వినాయక్ తీర్చిదిద్దుతున్నాడు. అలాగే కీలకమైన విలన్ రోల్ కి టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుందంటూ టాలీవుడ్ తెగ గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాజశేఖర్, చిరంజీవిలకి వ్యక్తిగతంగా వైరాలు ఉన్నాయన్నది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. కొందరు దీనినే అదునుగా తీసుకొని చిరంజీవి 150వ సినిమాలో రాజశేఖర్ విలన్ అంటూ ప్రచారం చేస్తున్నారని, ఈ వార్తలను ఎవ్వరూ నమ్మవద్దని మెగా క్యాంప్ నుండి వస్తున్న టాక్. మొత్తానికి అసలు రాజశేఖర్, చిరంజీవి సినిమాలో ఉన్నాడా? అస్సలు లేడా? వంటి విషయాలు తెలియాలంటే చిరంజీవి పుట్టిన రోజు వేడుకల వరకూ ఆగాల్సిందేనని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని అల్లు అరవింద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: