రేలంగి వెంకట్రామయ్య తరువాత తెలుగు సినిమా హాస్యరంగాన్ని సుదీర్ఘ కాలం ఏలిన రికార్డు అల్లురామలింగయ్య సొంతం. మాయాబజార్ నుండి జై సినిమా వరకు 1000 సినిమాలకు పైగా నటించిన అల్లు హాస్యాన్ని ఇష్టపడని వారు ఉండరు. అటువంటి అల్లురామలింగయ్య వ్యక్తిత్వాన్ని గురించి ఆయన కుమారుడు అల్లు అరవింద్ ఇవాళ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆశక్తికర విషయాలు వెల్లడించారు.  చిన్న తనంలో తన దస్తూరి బాగుండకపోతే రోజుకు నాలుగు పేజీల చొప్పున కాపీ రైటింగ్ పుస్తకాలు రాయించిన నాటి నుండి ఆయన చనిపోయే వరకు తన గురించి ప్రతి విషయంలోనూ తన తండ్రి అల్లు రామలింగయ్య చాల శ్రద్ద పెట్టేవారని మాట వినకపోతే లెంపకాయలు కూడ కొట్టే వారనీ అల్లు ఒక ఆసక్తికర విషయాన్ని మీడియాకు వివరించారు. తనకు 47ఏళ్ల వయస్సు వచ్చినతరువాత ఒక రోజు తన తండ్రిని కారులో ఎక్కించుకుని కార్ డ్రైవ్ చేస్తూ ఒక చోట సడన్ బ్రేక్ వేస్తే సీట్ బెల్ట్ లు లేని ఆ రోజులలో ఆ కుదుపుకి తన తండ్రి తలకు చిన్న బొప్పి తగిలితే ఇంటికి వచ్చాక లెంప పెలిపోయెలా ఎవడు నీకు డ్రైవింగ్ నేర్పింది అంటూ చెంపదెబ్బ కొట్టారని అరవింద్ ఆ జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు.  అదేవిదంగా తనకు జీవితంలో అన్నీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతో తనకు పదిహేనేళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి తనను ఓ కొడుకులా కాకుండా, స్నేహితుడిలా చూడటమే కాకుండా పదహారేళ్ళ వయసు నుంచే తనకు అన్ని ఆర్ధిక లావాదీవీలు తెలిసేలా ఆడిటర్ దగ్గరకు కూడా తీసుకు వెళ్ళే వారని అంటూ తమ , కుటుంబ రాబడి, ఖర్చు, ఆదా, ఎక్కడ ఎలా మదుపు చేయాలనే విషయాల్లోనూ తనను ఇన్‌వాల్వ్ చేసేవారాని అల్లుని గుర్తుకు చేసుకున్నాడు అరవింద్. అంతేకాదు ఈ రోజు తానూ సక్సస్ ఫుల్ నిర్మాతగా మారాను అంటే అది తన తండ్రి నేర్పిన పాఠాలే అని అంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: