కోలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్ళి అక్కడ 100 కోట్ల  హీరోయిన్ గా గుర్తింపు పొందిన అసిన్ ఇప్పుడు కాలం కలిసిరాక అటు బాలీవుడ్ లోను ఇటు కోలీవుడ్ లోను ఇలా రెండింటిలోను ఖాళీగా ఉంటోంది. ప్రస్తుతం చేయడానికి సినిమాలు లేకపోవడంతో అసిన్ సమాజసేవ బాట పట్టింది.  తన అవయవాలను దానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తన మరణానంతరం తన కళ్ళు, ఇతర అవయవాల్ని దానం చేయనున్నట్లు ప్రకటించింది అసిన్. అంతేకాదు తనను చూసి చాలామంది స్పూర్తి పొంది అవయవదానంపై అవగాహన పెంచుకోవడమే కాకుండా అవయవ దాన కార్యక్రానికి స్వచ్చందంగా జనం ముందుకు వస్తారు అని చెపుతోంది. ఇప్పటి దాకా రక్తదాన కార్యక్రమం గురించే ప్రజలలో అవగాహన ఉంది అని అంటూ అవయవదాన ప్రాముఖ్యతను గురించి ప్రజలలో అవగాహన కలిగించడానికి తనకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఈ కార్యక్రమానికి ప్రచార కర్తగా మారానని చెపుతున్న అసిన్ ఆలోచన మంచిది అయినా ఆమె మాటలకు ప్రభావితమై ఎంతమంది అవయదాన కార్యక్రమానికి ముందుకు వస్తారో చూడాలి.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవయవాలు పాడైపోయి, అవయవదాతల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్న రోగుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో అసిన్ కూడ చేరిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: