సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బలమైన మార్కెట్ ని సంపాదించుకున్న హీరో సూర్య. అందుకే సూర్య నటించిన మూవీలు కేవలం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నింటిలో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ లోనూ సూర్యకి మంచి మార్కెట్ ఉంది. దీంతో తను నటించిన ప్రతీ మూవీ తెలుగులోనూ డబ్బింగ్ అయి, కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంది. అందుకే తాజాగా సూర్య నటించిన అంజాన్ మూవీని తెలుగులో సికిందర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆడియో విడుదల నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి సూర్యని డైరెక్ట్ తెలుగు మూవీ ఎప్పుడు చేస్తారు అంటూ అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకి సూర్య త్వరలోనే తెరదించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం సూర్య ఓ డైరెక్ట్ తెలుగు సినిమాకి సైన్ చేసాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిటైల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. అయితే అందులో హీరోయిన్ గా సమంత నటిస్తుందంటూ క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య, తమిళంలో ‘మాస్’ సినిమాని స్టార్ట్ చేసాడు. ఈ సినిమా తర్వాత సూర్య చేయనున్న డైరెక్ట్ తెలుగు సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సూర్య, సమంత జంటగా కలిసి నటించిన అంజాన్ మూవీ ఈ నెల 15న రిలీజ్ అవుతుంది. మొత్తానికి సమంత మరోసారి సూర్య సరసన నటించటానికి ఆసక్తి చూపుతుంది. సూర్య తెలుగులో చేస్తున్న మూవీకి తనే కచ్ఛితంగా చేస్తాను అంటూ సమంత ముందే కమిట్మెంట్ తీసుకుందట. దీంతో సూర్య కూడ ఇందుకు గ్రీన్ ఇచ్చనట్టుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: