మెగా అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన 'గోవిందుడు అందరివాడేలే' టీజర్ నిన్న రాత్రి విడుదల అయ్యింది. పంచెకట్టుతో ఎడ్లబండిపై రామ్ చరణ్ డీఫరెంట్ లుక్ లో టీజర్ లో కనిపించాడు. కుటుంబ బంధాలను ఉద్వేగ పూరితంగా తన సినిమాలలో చూపెడుతూ పాత్రల మధ్య బంధుత్వాలను చక్కగా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తుడు అని పేరు గాంచిన కృష్ణవంశీ దర్శకత్వ ఛాయలు ఈటీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లోను కనిపించాయి.  అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1999లో కృష్ణవంశీ డైరెక్షన్‌లోనే వచ్చిన ‘అంతఃపురం' సినిమాలో ప్రకాష్ రాజు లుక్‌ని ఎలాగైతే చూపించాడో మళ్లీ 'గోవిందుడు' లోనూ కృష్ణవంశీ అలాంటి లుక్ ను ప్రకాష్ రాజ్ కు ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది. మొట్టమొదటిసారిగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాను చేస్తున్న రామ్ చరణ్ ను పల్లెటూరి వాతావరణ నేపధ్యంలో చూపెడుతున్న ఈ టీజర్ ను చూస్తున్నంతసేపు కృష్ణవంశీ గతంలో తీసిన ‘నిన్నే పెళ్ళాడుతా’, ‘మురారి’ సినిమా ఛాయలు అడుగడుగునా ‘గోవిందుడు’ టీజర్ లో కనిపించడం ఆశ్చర్యకరం. ఎటువంటి పంచ్ డైలాగులు లేకుండా కేవలం యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నడిచిన ‘గోవిందుడు’ టీజర్ రొటీన్ సినిమాలకు భిన్నంగా కనిపించింది. అదేవిధంగా రామ్ చరణ్ బాబాయిగా కనిపిస్తున్న శ్రీకాంత్ కూడ ఈ సినిమా తీజర్ లో డిఫరెంట్ గా కనిపిస్తూ ఈ సినిమా అంచనాలను మరింత పెంచుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: