సినిమాలకు వచ్చే జనం తగ్గి పోతూ ఉండటంతో తాము నిర్మిస్తున్న సినిమాలకు ఎదో విధంగా ప్రేక్షకులను ధియేటర్ల వద్దకు రప్పించడానికి నిర్మాతలు నానా తంటాలు పడుతున్నారు. దీనికోసం అనేక మార్గాలని కూడ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాలు చూస్తూన్నది ఎక్కువగా యువతరమే కాబట్టి వారిని టార్గట్ చేస్తూ హీరోహీరోయిన్స్ మధ్య లిప్ లాక్ సీన్స్ పెట్టి కలెక్షన్స్ పిండుకోవాలని చూస్తున్నారు.  ఒకవైపు చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల వరకు ఇదే కల్చర్ కొనసాగుతోంది. హీరోయిన్స్ మధ్య పోటీ పెరిగి పోవడంతో హీరోయిన్స్ కూడ ఈ సన్నివేశాలకు ఓకే చెపుతున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో యంగ్ హీరోయిన్ రెజీనా ముందు వరసలో ఉంది.  రెజీనా నటించిన ‘రొటీన్ లవ్ స్టోరి’, ‘రారా కృష్ణయ్య’ ఈ రెండు సినిమాలలోను రెజీనా ఘాఢమైన లిప్ లాక్ సీన్స్ తో యూత్ ను ఊదర కొట్టింది. అయితే ఆ సీన్స్ పండాయి కాని ఆ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. ఈ నేపధ్యంలో రాబోతున్న రవితేజా ‘పవర్’ సినిమాలో కూడ రెజీనా, రావితేజాల మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ లో అందమైన బీచ్ సాక్షిగా ఒక దట్టమైన లిప్ లాక్ సీన్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో రెజీనా లిప్ లాక్ లు ఏ సినిమాను హిట్ చేయలేకపోయాయి కాబట్టి అదే సెంటిమెంట్ ‘పవర్’ ను కూడ వేధిస్తుందా అనే మాటలు ఫిలింనగర్ లో సెటైర్లుగా పడుతున్నాయి. అయితే ఈ సెటైర్లు రవితేజా దృష్టికి రావడంతో రెజీనా లిప్ లాక్ విషయమై మాస్ మహారాజా కూడ భయపడుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయం తేలాలి అంటే ‘పవర్’ వచ్చేదాకా ఆగాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: