కోలీవుడ్ బ్యూటీ హన్సికను ఒక డైరెక్టర్ టార్చర్ పెట్టాడు అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఆ డైరెక్టర్ పెట్టిన బలవంతానికి తట్టుకోలేక హన్సిక అతడు చెప్పిన విధంగా ఆ సినిమాలో నటించి బయట పడిందని కోలీవుడ్ మీడియా రాతలు రాస్తోంది. ఇక వివరాలలోకి వెళితే హన్సిక హీరో ఆర్యాతో కలిసి కోలీవుడ్ లో 'మీగమెన్' అనే ఒక చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఒక సాంగ్‌లో ఆర్య సరసన హన్సిక కాస్త మోతాదుకు మించిన ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇది పచ్చి రొమాంటిక్ సీన్ కావడంతో హన్సిక ఈ సీన్ చేయనని తెగేసి చెప్పి షూటింగ్ స్పాట్ నుండి వెళ్ళి పోయిందట.  మధ్యలో ఆగిపోయిన ఈ సాంగ్ షూటింగ్ గట్టు ఎక్కించడానికి ఇక నేరుగా దర్శకుడు రంగంలోకి దిగి ఈ సీన్ చేయడానికి కాస్త ఇబ్బందిగానే అనిపించినప్పటికీ షూటింగ్ అంతా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతోంది కాబట్టి ఈ సీన్ లో హన్సికకు వచ్చే ఇబ్బంది లేదు అంటూ చెప్పడమే కాకుండా చాకచక్యంగా ఈ సీన్ లో నటించడానికి హన్సికను ఒప్పించాడని మీడియా టాక్.  డైరెక్టర్ చొరవతో హన్సిక ఆ బూతు సీన్ లో నటించకతప్పలేదని కోలీవుడ్ మీడియా గాసిప్ లు రాస్తోంది. అయితే హన్సికను అంత భయ పెట్టిన ఆ సీన్ ఏమిటి అన్న విషయం ఈ సినిమా రిలీజ్ అయితేకాని బయటకు రాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: