యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రీసెంట్ గా తండ్రి అయిన విషయం అందరికి తెలిసిందే. జూలై 22వ తేదీన ఎన్.టి.ఆర్ – ప్రణతి దంపతులకు మగబిడ్డ పుట్టాడు. జూనియర్ ఇంట వారసడు రావడంతో నందమూరి ఫ్యామిలీ అంతా తెగ సంతోషంతో సంభరాలు జరుపుకున్నారు. అయితే నందమూరి వారసుడి పేరు ఏమై ఉంటుందా అనేది అందరి నందమూరి అభిమానులతో పాటు, సామన్య జనాల్లోనూ ఓ రకమైన ఆసక్తి ఉంది. మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ ని తలపించేలా పేరు ఉంటుందా? ఉండదా? అనే విధంగా అందరూ ఆలోచిస్తున్నారు. అయితే తన తనయుని పేరుకి సంబంధించిన విషయాలని జూనియర్ బయటకు చెప్పాడు. ఆ శుభవార్తని తన అభిమానులతో షేర్ చేసుకోవాలని 4 సంవత్సరాల తర్వాత ఎన్.టి.ఆర్ మళ్ళీ ట్విట్టర్లో అడుగు పెట్టాడు. తన కుమారుడి పేరు అభయ్ రామ్ అని పెట్టామని తెలియజేశాడు. ‘చాలా హ్యాపీగా ఉంది. కొద్ది సేపటి క్రితమే నా కుమారుడు అభయ్ రామ్ నామకరణం కి మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేసామని’ ఎన్.టి.ఆర్ ట్వీట్ చేసాడు. ఈ పేరుకి అభిమానుల నుంచి పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: