టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ఫిల్మ్ ల హడావిడి నడుస్తుంది. ముఖ్యంగా పెద్ద హీరోల వద్ద నుండి, చిన్న హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఈ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు తెగ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఆ విధంగానే నందమూరి హీరోలు కూడ మల్టీస్టారర్ మూవీకి సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన సమాచారం ప్రకారం, నందమూరి హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇద్దరు కలిసి త్వరలోనే ఓ మూవీలో కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. గత కొంత కాలం నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో అతి దగ్గరగా మూవీకి సంబంధించిన కొన్ని డిస్కషన్స్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే కళ్యాణ్ రామ్ సైతం జూనియర్ ఎన్టీఆర్ తో ప్రొడ్యూజర్ గా ఓ మూవీని తీయాలని భావిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్ వస్తున్న కిక్2 మూవీకి నిర్మాతగా ఉంటున్నాడు. ఈ మూవీ అనంతరం సురేందర్ రెడ్డి కాంబినేషన్ లోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కలిసి నటించే అవకాశం ఉంటుందని టాలీవుడ్ టాక్. ఈ మూవీకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉంటాడని కూడ టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా నందమూరి హీరోల మల్టీస్టారర్ మూవీ అంటే అభిమానుల్లోనూ విపరీతమైన క్రేజీ పెరగడమే కాకుండా, స్టేట్ మార్కెట్ లో మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరుతాయని ఇండస్ట్రీ భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: