నందమూరి సింహం బాలకృష్ణ తన గాయం నుండి కోలుకుని తన ప్రమాద వివరాలు మీడియాకు తెలియచేసాడు. తన లేటెస్ట్ సినిమా షూటింగ్ సమయంలో బైక్ పై నుండి పడటంతో గాయమైనట్లు తెలుపుతూ తన తోడ భాగంలో 7 కుట్లు వేసారని తెలియచేస్తూ తన కొత్త సినిమాకు ఈగాయం ఒక గుర్తుగా మిగిలి పోతుందని జోక్ చేసాడు.  ఇదే సందర్భంలో తన 100వ సినిమాపై స్పందిస్తూ ఈ. సినిమాపై తన అభిమానులలో చాల భారీ అంచనాలు ఉన్నాయని చెపుతూ ఆ అంచనాలకు చేరుకునే కధ గురించి అన్వేషిస్తున్నానని బాలకృష్ణ తెలిపాడు. అదే విధంగా తన 100 వ సినిమా దర్శకుడి గురించి మాట్లాడుతూ తాను దర్శకుల వెంట పడనని ఏ దర్శకుడు అయినా ఒక మంచి కధతో తన దగ్గరకు వచ్చి తనకు నచ్చే విధంగా చెపితే ఆ దర్శకుడు చిన్న దర్శకుడా లేక  పెద్ద  దర్శకుడా అని చూడకుండా తన 100వ సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బాలయ్య. ఒక వైపు చిరంజీవి తన 150 సినిమా విషయంలో తనకు నచ్చిన కధ చెప్పిన వారికి కోటి రూపాయలు బంపర్ ఆఫర్ ప్రకటిస్తే బాలయ్య ఏకంగా కధ నచ్చితే చిన్న దర్శకుడు అయినా తన 100 వ సినిమాకు ఛాన్స్ ఇస్తానని చేప్పడం ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న టాప్ డైరెక్టర్స్ కు షాకింగ్ న్యూస్ అనుకోవాలి.  చాలామంది హీరోలలా తాను టాప్ దర్శకుల భజన చేయనని నందమూరి సింహం తన మాటలతో జర్క్ ఇచ్చాడు అనుకోవాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: