సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్ టాపిక్ గా ఉన్న హీరో,హీరోయిన్ సిద్దార్ధ్ అండ్ సమంత. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహ బంధం అని వీరు అనుకుంటున్నప్పకీ, బయటకు మాత్రం వీరి రిలేషన్ మ్యారేజ్ వరకూ ఉంటుందని గెస్ చేస్తున్నారు. అయితే సమంత, సిద్దార్ధ్ లు ప్రస్తుతానికి ప్రేమలో ఉన్నప్పటికీ, వీరిది పెళ్ళి వరకూ వెళుతుందా? లేదా? అనే దానిపై సమంత క్లారిటి ఇచ్చుకుంది. తాజాగా సమంత, సిద్దార్ధ్ తో కలిసి ఎన్నో వ్యక్తిగత విషయాలను మాట్లాడిందని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. సమంత, సిద్దార్ధ్ ఉన్న ప్రస్తుత రిలేషన్ ని అలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. అయితే పెళ్ళి అనేది ఇప్పట్లో లేనట్టే అని సమంత, సిద్దార్ధ్ కి క్లారిటి ఇచ్చుకుంది. గతంలో సమంత తీసుకున్న నిర్ణయం వల్ల సిద్దార్ధ్ తన వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలలో మార్పులు చేసుకున్నట్టుగా కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే సమంతకి ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అవ్వటమే కాకుండా, రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న హీరోయిన్స్ లిస్ట్ లోనూ సమంత ముందు ఉన్నారు. ఈ సమయంలో సిద్దార్ధ్ తో ఎఫైర్ వంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సమంత భావిస్తుందట. కోలీవుడ్ కి చెందిన ఓ రిపోర్టర్ సమంతని "సిద్దార్ధ్ కి సంబంధించిన వ్యవహారంలో క్లారిటి ఇవ్వమని" సింగిల్ లైన్ ఆన్సర్ కావాలని అడిగారట. అందుకు సమంత చాలా స్పీడుగా స్పంధించి, "ఇది నా వ్యక్తిగత జీవితం కదా. సంబంధం లేని వాళ్ళతో రిలేషన్ గురించి ఎలా అడుగుతారు. అయినా చెబుతున్నారు తను నాకు మంచి ప్రెండ్ మాత్రమే" అని ఆన్సర్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: