కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో కూతురు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రి ఇవ్వబోతుంది. తనే అక్షర హాసన్. కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ బిటౌన్ లో చేసిన మొదటి మూవీ అంతగా సక్సెస్ కాకపోవడంతో తనకి బాలీవుడ్ అంతగా కలిసి రాలేదు. కాని శృతిహాసన్ మాత్రం బిటౌన్ లో తను ఏంటో ప్రూవ్ చేసుకోవటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. సౌత్ లో వరుస మూవీలు చేసుకుంటూ ప్రస్తుతం బిజిగా ఉన్న శృతిహాసన్ కథ ఇలా ఉంటే ఇప్పుడు, ఈమె చెల్లి అక్షర హాసన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రి ఇస్తుంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘షమితాబ్’. ఆర్ బల్కి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్నాడు, ‘రాంఝానా’తో హిట్ కొట్టిన తర్వాత హిందీలో ధనుష్ నటిస్తున్న రెండవ హిందీ సినిమా. ఈ సినిమాతోనే కమల్ హాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా విడుదలవుతుంది. ఆ రోజు అక్షర హాసన్ ఫిల్మ్ కెరీర్ భవితవ్యం తేలనుంది. అక్షరహాసన్ కి షమితాబ్ మూవీ గ్రాండ్ సక్సెస్ ని ఇస్తే, తన ఫిల్మ్ కెరీర్ కి ఇది ఎంతో ప్లస్ అవుతుంది. అంతే కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ మార్కెట్ లోనూ అక్షర హాసన్ కి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ ఈ మూవీ ప్లాప్ అయితే అక్షర హాసన్ కూడ తన అక్క శృతిహాసన్ లాగే స్టార్టింగ్ ట్రబుల్ ని ఎదుర్కొవలసి ఉంటుంది. అయితే అక్షర హాసన్ నటిస్తున్న ఈ డెబ్యు ఫిల్మ్ కి తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ అక్షరాల అయిదు లక్షల రూపాయల మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: