దక్షిణాది హీరోలలో అత్యంత పొడుగుగా ఉండే రికార్డ్ రానా సొంతం. ఒక విధంగా చెప్పాలి అంటే రానా తన సినిమాల వలన వచ్చిన క్రేజ్ కంటే తన పర్సనాలిటీతో వచ్చిన క్రేజ్ ఎక్కువ. అందువల్లనే సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా రానాకు భారీ సినిమాలలో వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. తన విలక్షణమైన పర్సనాలిటీతో ఏ పార్టీకి వెళ్ళినా అందర్నీ ఆకర్షిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతూ ఉంటాడు. అటువంటి రానాకు ఈ మధ్య జరిగిన ఒక పార్టీలో ఒక వింత అనుభవం ఎదురైంది. ‘బాహుబలి’, ‘రాణీ రుద్రమ’ లాంటి భారీ సినిమాలలో విలన్ గా నటిస్తున్న రానాను ఒక వ్యక్తి ఆశ్చర్య పరచడమే కాకుండా ఆ వ్యక్తి రానాను భయ పెట్టాడట కూడ. మరో మాటలో చెప్పాలంటే ఆ వ్యక్తిని చుసిన వెంటనే రానా కూడ షాక్ అయిపోయాడట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆ వ్యక్తి రానా కన్నా చాల ఎత్తుగా ఉండటమే కాకుండా రానా నే భయపెట్టిన ఆజానుబాహుడు అతడు. చాలామంది రానా తో ఫోటో తీయించుకుంటే రానానే అతడిని చూసి షాక్ అయి ముచ్చటపడి అతడితో ఫోటోను తీయించుకోవడమే కాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పెట్టి హడావిడి చేస్తున్నాడు ఈ ‘బాహుబలి’ విలన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: