హీరో సూర్య తాను లేటెస్ట్ గా నటించిన ‘సికిందర్’ మూవీ ప్రమోషన్ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యు ఇస్తూ తన భార్య జ్యోతిక పై కామెంట్స్ విసిరాడు. భార్యగా, తల్లిగా, కోడలిగా తన బాధ్యతలను పక్కా ప్లాండ్ గా నిర్వర్తిస్తూ తన కుటుంబ సభ్యులు అందరి దగ్గర మంచి హోమ్ మేకర్ అనే బిరుదును కొట్టేసిన జ్యోతికను చూస్తే తనకు చాల జలసీగా ఉంటుందని నవ్వుతూ జోక్ చేసాడు సూర్య. అంతేకాదు చంద్రముఖి సినిమాలో ఆమె నటనకు ఫ్యాన్స్ గా మారిపోయిన ఎంతో మంది ఇప్పటికీ జ్యోతికను సెలెబ్రెటీగా ఆరాధిస్తూ ఉంటె హీరోగా తనకు వచ్చిన క్రేజ్ కన్నా జ్యోతికకు ఎక్కువ క్రేజ్ రావడం తనకు ఆనందంగా ఉన్నా ఒకొక్కసారి అసూయ కలుగుతుందని జ్యోతిక పై సెటైర్లు వేసాడు సూర్య.  సినిమాలకు దూరమై ఎనిమిదేళ్ళు గడిచిపోతున్నా ఇంకా చాలామంది దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలలో నటించమని అడగడం చూసి ఇంత క్రేజ్ ఉన్న నటిని ఇంటికి పరిమితం చేయడం ఇష్టంలేక జ్యోతిక రీ ఎంట్రీకి తాను పచ్చ జెండా ఊపానని అంటున్నాడు ఈ కోలీవుడ్ టాప్ హీరో.  అయితే విభిన్న కధాంసంతో రూపొందుతున్న ఈ సినిమా హిట్ అయితే రానున్న కాలంలో జ్యోతిక నుంచే తనకు పెద్ద పోటీ వచ్చినా ఆశ్చర్యం లేదు ఆంటూ జ్యోతికను ఆకాశానికి ఎత్తేశాడు సూర్య.  

మరింత సమాచారం తెలుసుకోండి: