ఒకనాటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు విలన్ గా మారి కోట్లు గణిస్తూ ఉండటంతో ప్రస్తుతం డిమాండ్ లేని చాలామంది హీరోలు విలన్స్ గా మారి తమ అదృష్టాన్ని పరిక్షీంచు కుoటున్నారు. నిన్న ఈ లిస్టులో హీరో అర్జున్ చేరితే లేటెస్ట్ గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవడంతో తాను నిర్మాతగా మారి మాస్ మహారాజా రవితేజాతో నిర్మిస్తున్న ‘కిక్’ సీక్వెల్ లో రావితేజాకు చుక్కలు చూపెట్టే విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు అని ఫిలింనగర్ టాక్. గతంలో కళ్యాణ్ రామ్ తాత సీనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ ఛాయలున్న రావణాసురుడి పాత్ర పోషించి మెప్పించినట్లుగా తన తాత మార్గాన్ని ఎంచుకుని ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నాడు అని అనుకోవాలి. రవితేజా క్రేజ్ ను ఆసరాగా చేసుకుని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘కిక్’ సీక్వెల్ లో ఈ నందమూరి హీరో చేస్తున్న సాహసం విజయవంతం అయితే నందమూరి కుటుంబం నుండి తెలుగు తెరకు మరొక అందమైన విలన్ వచ్చాడనుకోవాలి. ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ విలన్స్ తో వెండితెర పై ఆటలాడుకున్న మాస్ మహారాజాకు కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రయోగం షాక్ ఇస్తుందా? లేకుంటే నందమూరి హీరోనే ఆటలాడించిన మాస్ హీరోగా రవితేజా మరో రికార్డు క్రియేట్ చేస్తాడా అనే విషయం వచ్చే సంవత్సరం తేలుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: