సాయికుమార్ నట వారసుడిగా ‘లవ్ లీ’, ‘ప్రేమ కావాలి’ సినిమాల ద్వారా ప్రయత్నించిన ఆది కి ఆ సినిమాలు హిట్ అవడంతో అతడికి కొంతమంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఆ తరువాత ఆది నటిస్తున్న సినిమాలు వరస పెట్టి పరాజయం చెందడంతో యంగ్ హీరోల రేసులో ఆది నిలబడతాడా అనే అనుమానం మొదలైంది.  దీనితో కొద్దిరోజుల క్రితం విడుదలైన గాలిపటం సినిమా పై బాగా ఆశలు పెట్టుకున్నాడు ఆది. అయితే ఈ సినిమాకు మొదట్లో ఓపినింగ్స్ బాగానే వచ్చినా రెండవ వారం నుండి ఈ సినిమా పై బూతు టాక్ విపరీతంగా స్ప్రెడ్ కావడంతో యూత్ కూడ భయపడిపోయే సినిమాగా ‘గాలిపటం’ మారిపోయింది. ఈ మధ్య మీడియాకు ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూకు ఇచ్చిన ఆది ఒక విచిత్ర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలోని క్లైమేక్స్ ను చూసి చాలామంది తన అభిమానులు తన శత్రువులుగా మారిపోయి తనని తిడుతూ సేల్స్ ద్వారా సందేశాలు పెట్టారనే వాస్తవాన్ని దాచుకోకుండా నిజాయితీగా ఆది మీడియాతో షేర్ చేసుకోవడం ఆశ్చర్యంగా మారింది.  పెళ్లి అయ్యాక కూడ మాజీ లవర్స్ తిరిగి కలుసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్న కధను సినిమాగా మార్చి చేసిన ప్రయోగాన్ని చూసి తన తండ్రి సాయికుమార్ ప్రస్తుతం యువతరం ఇలా ఆలోచిస్తోందా? అని అన్నారని అంటూ ఇటువంటి ప్రయోగాలు భవిష్యత్తులో చేయనని ఆది చెపుతున్నాడు. గాలిపటం సినిమాలోని వాస్తవాలను ఆది నిజయితీగా అంగీకరించినా తన హీరో కెరియర్ కు జరిగిన డ్యామేజ్ ఎప్పటికి మాసిపోతుందో అన్నదే సమాధానం లేని ప్రశ్న.  

మరింత సమాచారం తెలుసుకోండి: