అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా కీలక ప్రకటన రేపు ఉండదు సరికదా అభిమానులకు మెగా స్టార్ తన పుట్టినరోజునాడు అందుబాటలో ఉండడు అనే వార్తల హడావిడి ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి రేపు తన పుట్టినరోజునాడు భాగ్యనగరంలో ఉండడని హిమాలయ దేశం నేపాల్ కు తన భార్యతో కలిసి వెళుతున్నాడని సమాచారం. అంతేకాదు నేపాల్ లోని ఒక ప్రముఖ దేవాలయంలో చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసుకుంటాడని కూడా వార్తల హడావిడి వినిపిస్తున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన ఇంటికి వచ్చే అభిమానులకు చిరంజీవి తరపున రామ్ చరణ్ ఆతిధ్యం ఇస్తాడని టాక్. అయితే వినిపిస్తున్న ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియవు కాబట్టి ఈ వార్తలే నిజం అయితే చిరంజీవిని పుట్టినరోజునాడు కలుద్దాం అనుకున్న అభిమానులకు అదేవిధంగా చిరంజీవి 150వ సినిమా ప్రకటన గురించి ఎదురు చూస్తున్న మీడియా వర్గాలకు ఇది షాకింగ్ న్యూస్ అనుకోవాలి. చిరంజీవి తన 150వ సినిమా కధ విషయంలో ఒక క్లారిటీకి ఇప్పటికీ రాలేక పోవడంతో చిరు ప్రస్తుతానికి మీడియాను ఇలా తప్పించు కున్నాడా? అనే సందేహాలు కూడ వినపడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: