నందమూరి సింహం బాలయ్యకు మెగాస్టార్ చిరంజీవికి వారిద్దరూ సినిమాలలో నటిస్తున్నప్పటి నుంచి సరైన సంబంధ బాంధవ్యాలు లేవు అన్నది ఓపెన్ సీక్రెట్. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ప్రచారం చేస్తున్న రోజుల నేపధ్యం నుండి బాలకృష్ణ చిరంజీవుల సంబంధాలు మరింత క్షీణించాయి.  ఈ నేపధ్యంలో నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలలో అభిమానులతో మాట్లాడిన రామ్ చరణ్ మాటలు బాలయ్యను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని బాలకృష్ణ అభిమానులు బాధపడుతున్నారు. తన తండ్రి చిరంజీవి 150వ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా మీసాలు తిప్పే సినిమా కాదని అదేవిధంగా కత్తి పట్టుకుంటూ పెద్ద బొట్టు పెట్టుకుని తిరిగే పాత్రలో చిరంజీవి కనిపించడని సంచలన వ్యాఖ్యాలు చేసాడు చరణ్. అంతేకాదు ఈ సినిమాను రికార్డుల కోసం తీయడంలేదని కేవలం మెగాస్టార్ అభిమానులు ఆనందంగా చూసే మంచి సినిమాగా ఈ సినిమా ఉంటుందని కామెంట్లు విసిరాడు చరణ్. అయితే చరణ్ చేసిన కామెంట్లు బాలయ్యను టార్గెట్ చేస్తూ ఉండటంతో బాలయ్య అభిమానులు చరణ్ కామెంట్లకు తీవ్ర అసహనానికి లోను అవుతున్నారని ఫిలింనగర్ టాక్. చరణ్ బాలయ్యను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్లు చేసాడో? లేక అనుకోకుండా అన్నాడో అన్న విషయాన్ని పక్కకు పెడితే చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ సినిమాలో చిరూ మీసం మెలేసిన సంగతి చరణ్ మర్చిపోయాడా అన్నదే ప్రశ్న.  

మరింత సమాచారం తెలుసుకోండి: