క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పై ఆమె చెల్లి నిషా అగర్వాల్ వేసిన లేటెస్ట్ సెటైర్లు ఆశక్తి దాయకంగా మారాయి. తన అక్క కాజల్ ప్రోత్సాహంతో తెలుగు సినిమాలలో అవకాశాలు వెతుక్కున్న నిషాకు అదృష్టం కలిసి రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని తన ఆక్క కాజల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకుంది.  కొన్నాళ్లు పెళ్ళి సరదా తీరిన తరువాత ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి సారించింది. ప్రస్తుతం మలయాళంలో ‘భాగ్య భాగ్య’ అనే చిత్రంలోను తెలుగులో ‘డీకే బోస్’ చిత్రంలోను నటిస్తోంది. తమిళంలో కూడా అవకాశాల వేట మొదలెట్టింది అని టాక్. ఈ మధ్య ఈమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘మీ అక్క కాజల్ అగర్వాల్ మాదిరి గ్లామరస్‌గా నటిస్తారా?’’ అన్న ప్రశ్నకు చెల్లి జవాబు ఇస్తూ తాను తన అక్క కాజల్ మాదిరిగా అందాలారబోత తన వల్ల కా దని ఖరాఖండిగా చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు అలాంటి పాత్రలు తనకు నప్పవని కూడ చెప్పింది. నిజం చెప్పాలంటే గ్లామరస్ పాత్రలో నటించడం తనకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని నీతులు చెపుతోంది. అయితే చెల్లి మాటలు కాజల్ కు ఎలాంటి షాక్ ఇస్తాయో అన్న విషయం పక్కకు పెడితే ఆమె ఎన్నో ఆసలు పెట్టుకున్న ‘మగధీర’ బాలీవుడ్ రీమేక్ అవకాశాన్ని అలియా భట్ తన్నుకు పోయింది అనే వార్తలు వస్తున్నాయి. ఒక పక్క చెల్లి సెటైర్లు మరో పక్క అలియా భట్ షాక్ ల మధ్య ప్రస్తుతం ఈ కలువ కనుల భామ అవకాసాల వేట కొనసాగిస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: