రామ్ చరణ్ కు కుక్కలు, గుర్రాలు అన్నా విపరీతమైన ప్రేమ అన్న విషయం తెలిసిందే. తన కుక్కకు ఒక దర్శకుడు సరైన గౌరవం ఇవ్వలేదని ఆ దర్శకుడునే మార్చాడు చరణ్. తన ఇంట్లో పెరుగుతున్న కుక్కలు తన పిల్లల కంటే ఎక్కువ అని భావించే చరణ్ ఇల్లు ఒక చిన్న సైజు జూలాఉంటుందని చాలామంది జోక్ చేస్తారు.  అటువంటి చరణ్ తనకు ‘మగధీర’ తో అదృష్టాన్ని తెచ్చి పెట్టిన కాజల్ ను ‘గోవిందుడు అందరివాడే’ సినిమా సెట్లో గుర్రంతో పోలుస్తూ తన ఇంట్లో పెరుగుతున్న గుర్రం పిల్ల కాజల్ కన్నా అందంగా ఉంటుందని టీజ్ చేస్తున్నాడట. వినడానికి జోక్ గా అనిపిస్తున్నా చరణ్ ఇంట్లో మాత్రం మరో అందమైన కాజల్ ఉంది. ప్రస్తుతం తన ఇంట్లో పెరుగుతున్న అందమైన గుర్రానికి కాజల్ అని పేరు పెట్టడమే కాకుండా కాజల్ ఎలా ఉంది అంటూ తరుచు ఇంటికి ఫోన్ చేసి అడగడం ‘గోవిందుడు’ సెట్లో నటిస్తున్న కాజల్ కు టీజింగ్ గా మారిందని టాక్. నిర్మాతల దగ్గర కోటి రూపాయల పైన పుచ్చుకునే కాజల్ తన పేరుతో మెగా కుటుంబంలో మరొక వ్యక్తి పెరుగుతూ తనకే పోటీగా మారుతుందేమోనని భయ పడుతోంది అని సెటైర్లు పడుతున్నాయి.  మెగా కుటుంబం ఇప్పటికే ఎంతో మంది హీరోలు కలిగిన కుటుంబంగా రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటే ఇక హీరోయిన్ల పేర్లతో జంతువులు కూడా చేరిపోతే టాలీవుడ్ ను శాసించే కుటుంబంగా మెగా ఫ్యామిలీ రికార్డును క్రియేట్ చేయడం ఖాయం అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: