కొరియోగ్రాఫర్ స్థాయి నుండి యాక్టర్ గా, డైరెక్టర్ గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన వ్యక్తి రాఘవ లారెన్స్. రాఘవ లారెన్స్ కోరియోగ్రాఫర్ గా వచ్చిన సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. అలాగే తన కెరీర్ ని డైరెక్టర్ గా మార్చుకొని కూడ సక్సెస్ లను సాధించాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా రాఘవ లారెన్స్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న చిత్రాలు భారీ డిజాస్టర్స్ ను అందుకుంటున్నాయి. దీంతో రాఘవ లారెన్స్ కి డైరెక్షన్ ఇవ్వాలంటే నే చాలా మంది నిర్మాతలు, హీరోలు భయపడుతున్నారు. ఇదిలా ఉంటే రాఘవా లారెన్స్ గతంలో పలు నిర్మాతల వద్ద నుండి అడ్వాన్స్ మనీని తీసుకున్నాడంట. అయితే తను తీసిన తాజా చిత్రాలు ఘోర డిజాస్టర్స్ కావడంతో, అందరూ రాఘవ లారెన్స్ నుండి మనీను వెనక్కి తీసుకుంటున్నారు. దీని కారణంగా లారెన్స్ చాలా వరకూ నష్టాల్లో ఉన్నాడని కోలీవుడ్ కి చెందిన ప్రముఖ ఛానల్ ఓ స్టోరిని టెలికాస్ట్ చేసింది. ప్రస్తుతం లారెన్స్ ముని3 మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. ‘ముని’, ‘కాంచన’.. కామెడీ హర్రర్ గా తెరకెక్కిన ఈ సినిమాలకి సీక్వెన్స్ గా ప్రస్తుతం ముని 3 సినిమా రూపొందుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి కావల్సి ఉండగా, ఈ మూవీకి సంబంధించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ బిజిగా ఉండటంతో చిత్ర విడుదల, అలాగే షూటింగ్ కి సంబంధించిన పనులు చాలా లేటుగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇక కేవలం సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. గత సీక్వెల్స్ కంటే ఈ సినిమాలో ఎక్కువగా సిజి వర్క్ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. ఈ మూవీలో రాఘవ లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ కీలాక్ పాత్రలో కనిపించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: