పవన్ కళ్యాణ్ సినిమాలకు అమెరికాలో భారీ ఓపెనింగ్స్ వస్తాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పవనిజం సునామి అమెరికాను షేక్ చేస్తోంది. “నచ్చింది చేయడం హీరోయిజం – జనం మెచ్చింది చేయడం పవనిజం” అంటూ సాగే పాటలోని చరణాలకు అమెరికాలోని పవన్ అభిమానులు చిందులు వేస్తూ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వైరల్ లా ఈ విడియో పై విపరీతమైన హిట్స్ పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో షారుఖ్ ఖాన్ రజినీకాంత్ కు సెల్యూట్ చేస్తూ షారుఖ్ చేసిన డాన్స్ ను అనుసరిస్తూ పవన్ పై రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్. పవన్ సూపర్ హిట్ సినిమాలలోని కొన్ని గెటప్ ల స్టెప్స్ పవన్ వీరాభిమానులు ఈ వీడియోలో ప్రదర్శించారు. అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ‘పవనిజం డే’ గా జరుపుకోవడానికి పవన్ అభిమానులు నిశ్చయించడంతో ఆరోజుకు ప్రాముఖ్యత కలిగించే విధంగా ఈ వీడియోను డిజైన్ చేసి పవన్ అభిమానులలో జోష్ ను నింపడానికి అమెరికాలోని పవన్ అభిమానులు చేస్తున్న కృషిలో భాగమే ఈ వీడియో. ఈ వీడియోలో పవన్ అభిమానులతో పాటు అమెరికన్స్ కూడ స్టెప్స్ వేయడం చూస్తూ ఉంటె పవనిజం నిజంగానే ప్రపంచ స్థాయికి చేరిపోయిందా అని ఎవరికైనా అనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: