1980 - 1990 ల మధ్య టాలీవుడ్ ను దర్శకుడిగా శాసించిన రాఘవేద్రరావు దర్శకత్యంలో అనేక సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆరోజులలో ప్రతి టాప్ హీరో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటిస్తే చాలు తమ కెరియర్ నిలబడి పోతుంది అని అనుకునేవారు. అటువంటి దర్శకేంద్రుడు ప్రస్థుతం మారిన పరిస్థుతులలో సినిమాలు తీయడం బాగా తగ్గించి వేసాడు.  ఈ నేపధ్యంలో తాను కూడ బుల్లి తెర పై మెరవాలని రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ కార్యక్రమం మంచి పాపులారిటీ సంపాధించుకుంది. తన దర్శకత్వంలో నటించిన అనేక మంది హీరో హీరోయిన్స్ ను ఈ కార్యక్రమం ద్వారా రాఘవేంద్రరావు ఇంటర్వ్యూ చేయిస్తూ అలనాటి విషయాలను ప్రేక్షకులకు గుర్తుకు తెస్తున్నాడు.  ఈ పరయత్నంలో భాగంగా ఈ మధ్యనే ప్రసారం అయిన ఈ కార్యక్రమంలో మెగా స్టార్ చిరంజీవి అతిధిగా వచ్చి టాలీవుడ్ లో తన మార్కెట్ పెంచిన దర్శకుడిగా రాఘవేంద్రరావుని పొగుడ్తూ ఆకాశానికి ఎత్తేశాడు. అయితే ఈ పొగడ్తల మధ్య ఒక ఊహించని విషయాన్ని రాఘవేంద్రరావు బయట పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. రాఘవేంద్రరావు చిరంజీవుల కాంబినేషన్ లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు దర్శకుడిగా రాఘవేoద్రరావును కాకుండా వేరే దర్శకుడి గురించి ఆ సినిమా నిర్మాత అశ్వనీ దత్ ఆలోచిస్తూ ఉంటే వేరే దర్శకుల ఆలోచన వద్దు రాఘవేంద్రరావుతోనే ఈ సినిమా చేస్తానని చిరంజీవి పట్టుపట్టి నిర్మాతను ఆ కాలంలోని డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించాడట. ఇంత కధ నడవడానికి గల కారణం ఈ సినిమా నిర్మాణం ముందు రాఘవేంద్రరావు సినిమాలు వరసగా మూడు పరాజయం చెందినా ధైర్యంగా తనతో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేసి తనకు మరో కెరియర్ బ్రేక్ చిరంజీవి ఇచ్చాడు అని ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు చెప్పడం అందరితో పాటు చిరంజీవిని కూడ ఆశ్చర్య పరిచింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: