కొన్ని పోలికలు కొంతమందికే బాగుంటాయి ప్రతి విషయాన్ని కాపీ చేద్దామని ప్రయత్నిస్తే అది వినడానికి లేదా చదవడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పవన్ అభిమానులు అంతా ‘పవనిజమ్’ అంటూ హడావిడి చేస్తుంటే తాము కూడ ఈరేసులో ఉన్నాము అంటూ కొంతమంది జూనియర్ అభిమానులు తమ హీరో ‘రభస’ విడుదల సందర్భంగా ‘తారకిజం’ క్యాంపైన్ మొదలు పెట్టడానికి వెబ్ మీడియాను రంగంగా సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనపడుతున్నాయి. ‘రభస’ విడుదల రోజున ఎన్టీఆర్ అభిమానులంతా వైట్ షర్టులు వేసుకుని ధియేటర్లకు రమ్మని పిలుపు ఇస్తూ వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమానులు ఒక పోస్టర్ ను కూడ క్రియేట్ చేసి ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. 'Let us Wear While Shirt on the Release Day 'Rabhasa'అనే వాక్యంతో... "Time To Unite" అనే స్లోగన్ తో ఈ క్యాంపైన్ జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు ఈ క్యాంపైన్ కు ‘తారకిజం’ అనే పేరు పెట్టినట్లు కూడ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చైతన్యాన్ని యంగ్ టైగర్ అభిమానులు కేవలం ‘రభస’ సినిమాను సూపర్ హిట్ చేయడానికి ఎత్తుకున్నారా? లేదంటే సమాజం పట్ల తమ భాద్యతను గుర్తు చేసుకుంటూ ఏమైనా కొన్ని మంచి పనులు చేయడానికి ఈ ‘తారకిజం’ భుజాన ఎత్తుకున్నారా అన్న విషయం పై క్లారిటీ లేదు.  నందమూరి తారకరామారావు మనవడు అయిన జూనియర్ తన అభిమానుల చైతన్యాన్ని సక్రమంగా నడిపించ గలిగితే భవిష్యత్ నాయకుడిగా జూనియర్ రూపొందే అవకాశాలు ఉన్నాయి. తన అభిమానులలో వస్తున్న ఉత్సాహాన్ని కేవలం ‘రభస’ కు పరిమితం చేయకుండ మంచి పనులకు వినియోగిస్తే చాల బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: