టాలీవుడ్‌ ప్రిన్స్ మహేష్ బాబు సామాన్యంగా గాసిప్ లకు ఆమడి దూరంలో ఉంటాడు. అయితే మొట్టమొదటి సారిగా మహేష్ తో తమన్నా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో వీరిద్దరి మధ్య ఎదో భేదాభిప్రాయం వచ్చింది అంటూ ఫిలింనగర్ లో వార్తలు గుప్పు మంటున్నాయి. తమన్నా ఎప్పటి నుంచో మహేష్ తో నటించాలని కలలు కన్న తరువాత ఆమెకు ‘ఆగడు’ లో అవకాశం దక్కింది. టాలీవుడ్ ప్రిన్స్ సరసన హీరోయిన్‌గా చేసే ఆఫర్ వచ్చిందంటే ఎంతటి హీరోయిన్ అయినా జోష్ గా ఉంటుంది. అయితే తమన్నా విషయంలో అది సీన్ రివర్స్ అయిందని ఫిలింనగర్ టాక్.  దీనికి కారణం 'ఆగడు' మూవీ షూటింగ్‌లో తమన్నా ప్రవర్తనని చూసినవాళ్లు ఈ గాసిప్పులకు ప్రాణం పోస్తున్నారు. ‘ఆగడు’ సెట్ పై ఈ ఇద్దరిపై షూట్ చేసే సీన్స్ టేకింగ్ గురించి కలిసి చర్చించుకోవాల్సిన సందర్భంలో ప్రిన్స్‌తో తమన్నా కొంత డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోందని ఈ షూటింగ్ చూసినవాళ్ళు అనుకుంటున్నారని టాక్. అంతేకాదు మహేష్ బాబుతో ఏమీ చర్చించకుండానే డైరెక్ట్ గా సీన్‌లోకి వెళ్లిపోయి డైరెక్టర్ తో షాట్ కు తాను రెడీ చెప్పేసుకుంటోందట ఈ మిల్కీ బ్యూటీ.  సెట్స్ పై తమన్నా విచిత్ర ప్రవర్తన చూసిన కొంతమంది ఈమె మహేష్ ను లెక్క చేయడం లేదు అని అనుకోవడమే కాకుండా వీరిద్దరి మధ్య ఏమైంది అంటూ గుసగుసలు ఆడుకుంటున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి ‘ఆగడు’ పబ్లిసిటీ విషయంలో మహేష్ కు ఇస్తున్నత ప్రాధాన్యత లో సగం కూడ తనకు ఇవ్వకపోవడంతో తమన్నా మహేష్ పై కోపంగా ఉంది అంటూ మరో గాసిప్ కు తెర లేవనెత్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: