సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. వినాయ చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఇప్పుడు యూ ట్యూబ్ లో సంచలనాలను క్రియోట్ చేస్తుంది. ఈ మూవీలో రజినీకి జోడిగా అనుష్క శెట్టి , సోనాక్షి సిన్హా నటిస్తున్నారు, దర్శకుడు k.s.రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీపై ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా దృష్టి పెట్టింది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత గా రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియా లో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. అయితే మొదటి లుక్ మోషన్ పోస్టర్ కి మొదటి రోజునే 50 లక్షల హిట్స్ రావటం ఈ సినిమా కి మొదటి రికార్డు గా చెప్పవచ్చు. అలాగే రెండవ రోజు ఈ పోస్టర్ కి 20 లక్షల హిట్స్ వచ్చాయి. దీంతో ఏకంగా లింగా మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి దాదాపు 70 లక్షల హిట్స్ రావడంతో ఈ మూవీపై సినీ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో ఎక్స్ పెట్టేషన్ష్ ఉన్నాయో దీన్ని చూస్తేనే అర్ధం అవుతుంది. ఎ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని దీపావళి కి రిలీజ్ చేసి సినిమా ని సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్భం గా చిత్ర నిర్మాత మాట్లాడుతూ “ లింగా చిత్రానికి సంభందించి మొదటి లుక్ ని ఈ వినయక చవితికి రిలీజ్ చేసాము. చూసిన ప్రతి ఒక్కరు తలైవా , సూపర్ స్టార్ రజినీకాంత్ గారి లుక్ అదిరిపోయిందని అంటున్నారు. అంతే కాకుండా ఒక్కరోజులోనే రికార్డు హిట్స్ ఇచ్చి కొత్త రికార్డుని సృష్టించారు. ఇంతటి ఆనందాన్ని మాకు , మా టీంకి ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదాలు. రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళి కి విడుదల చేసి, సినిమాని సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పుట్టిన రోజున విడుదల చేస్తాము” అని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: