నాగార్జున తన కుమారుడు అక్కినేని అఖిల్ ని లాంచ్ చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేయడమే కాకుండా దర్శకుడు ఎంపిక కూడ పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాసును తన మొట్టమొదటి సినిమాతోనే మాస్ హీరోగా సెటిల్ చేసిన వివి.వినాయక్ పై నాగార్జున ద్రుష్టి పెట్టడమే కాకుండా ఇంచుమించు వినాయక్ ను అఖిల్ తొలి సినిమాకు డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు ఫిలింనగర్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.  ఈనెల సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా అఖిల్ తొలి సినిమా లాంచింగ్ భారీ స్థాయిలో ఉండబోతోందని ఫిలింనగర్ టాక్. దీనికి సంబంధించి ఇప్పటికే నాగార్జున వినాయక్ ల మధ్య చర్చలు జరగడమే కాకుండా ఈ సినిమా కధకు సంబంధించి ఒక నిర్ణయానికి కూడ నాగార్జున వచ్చినట్లుగా తెలుస్తోంది.  వినాయక్ చిరంజీవి 150వ సినిమాకు వినాయక్ దర్శకుడిగా మారుతాడు అని ప్రచారం జరుగుతూ ఉంటే మధ్యలో ఈ ఊహించని ట్విస్ట్ తో వినాయక్ చిరంజీవుల సినిమా లేనట్లే అనుకోవాలి. మాస్ సినిమాలను తీయడంలో స్పెషలిస్ట్ గా పేరుగాంచిన వినాయక్ చేతిలో అఖిల్ నటించడం బట్టి మాస్ హీరోగా పరిచయం కావాలి అనుకున్న అఖిల్ కోరిక తీరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.  మెగా కుటుంబ సన్నిహితుడు వినాయక్ అక్కినేని కుటుంబ హితుడుగా మారడం ఫిలింనగర్ లో నమ్మలేని నిజంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: