బాలీవుడ్ టాప్ సెలెబ్రెటీ స్టేటస్ ను అనుభవిస్తూ ఇంత పెద్ద వయసులో కూడ ఉత్సాహంగా ట్విట్లు చేస్తూ వెబ్ మీడియాలో నిరంతరం యాక్టీవ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ కు కోటి మంది ఫాలోయర్స్ సంఖ్య ఏర్పడటం బాలీవుడ్ సంచలన వార్తగా మారింది. ‘ట్విటర్ లో నన్ను కోటి మంది అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నా తరువాత లక్ష్యం రెండు కోట్లు’ అంటూ అమితాబ్ ట్విట్ చేసారు. తన వ్యక్తిగత సినిమా జీవితానికి సంబందించిన విషయాలనే కాకుండా జాతీయ అంతర్జాతీయ విషయాల పై అమితాబ్ తన్ భావాలను ఎప్పుడూ తన అభిమానులతో పంచు కుంటు ఉంటారు. అమితాబ్ ట్విటర్ ఎకౌంట్ లో ఇప్పటి వరకు ఆయన చేసిన 33,000 ట్విట్స్ ఉండటం ఒక సంచలనంగా పేర్కొంటున్నారు.  వెబ్ మీడియాలో రకరకాల ప్రయోగాలకు ముందు వరుసలో ఉండే బిగ్ బి ఈ మధ్యనే ‘బచ్చన్ బోలో’ అనే పేజీని ఓపెన్ చేసి ప్రతి బుధవారం తన అభిమానులతో అనేక విషయాల పై తన అభిప్రాయలను పంచుకుంటూ మరో నూతన విధానానికి తెర తీసాడు అమితాబ్. ఒక వైపు సినిమాలలో నటిస్తూ మరొక వైపు బుల్లితెర పై తన హవాను కొనసాగిస్తున్న అమితాబ్ ఇప్పటికీ  నేటి టాప్ బాలీవుడ్ హీరోలతో సమానంగా స్టెప్స్ వేయగలగడం అమితాబ్ స్టామినాను సూచిస్తోంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: