ఒకవైపు తన తండ్రి పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా తాను నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ కీలక సన్నివేశాలలో పాల్గొంటూ దేవుడికి మనిషికి మధ్య జరిగే సంఘర్షణకు సంబంధించి ఈ సినిమాలో నటిస్తున్న వెంకటేష్ కు కలియుగ కృష్ణుడిగా గీతా తత్వాన్ని తన డైలాగ్ లలో వివరిస్తూ ఉంటే పవన్ కొడుకు అకిరా నందన్ తాను నటిస్తున్న సినిమాకు డబ్బింగ్ మొదలు పెట్టాడు. రేణుదేశాయ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాకు అకిరా నందన్ డబ్బింగ్ ప్రారంభించాడు అంటూ పవన్ కొడుకు డబ్బింగ్ చెపుతున్న ఒక ఫోటోను ఈ రోజు రేణుదేశాయ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అనుకోకుండా జరిగిందే అయినా ఒక వైపు తండ్రి పవన్ మరొక వైపు కొడుకు అకిరా నందన్ తమ తమ సినిమాల విషయంలో బిజీగా మారడం యాదృచ్ఛికo అనుకోవాలి. ఇప్పటికే మెగా కుటుంబ వారసులతో హోరెత్తి పోతున్న టాలీవుడ్ ను మరింత షేక్ చేయడానికి రేణుదేశాయ్ వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న ప్లాన్ ఆమె ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాకు ఎంత వరకు కలిసి వస్తుందో చెప్పడం కష్టమే. ఏది ఏమైనా పవన్ వీరాభిమానులకు మాత్రం పవన్ వారసుడుని సినిమాలలో నటిస్తున్నప్పుడు చూసే అవకాశం కల్పించిన రేణుదేశాయ్ కి పవన్ అభిమానులు పైకి చెప్పలేకపోయినా మనసులో అయినా చాల సంతోషిస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: