సినిమాలలో నటిస్తూ ఎప్పుడు గాసిప్పులకు చిరునామాగా ఉండే కోలీవుడ్ యంగ్ హీరో శిoభు ఒక కోరిక కలిగింది. చాల మంది నటీనటులు పవన్ తో నటించాలి అని కోరుకుంటూ ఉంటే శిoభుకు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే సినిమాకు ఒక పాట పాడాలనే కోరికను మీడియా సాక్షిగా పవన్ దృష్టికి తీసుకు వెళుతున్నాడు. ఇక వివరాలలోకి వెళితే ఈరోజు మలేషియాలో జరుగుతున్న ‘సీమ’ అవార్డ్స్ ఫంక్షన్ లో శిoభుకి బెస్ట్ సింగర్ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. జూనియర్ నటించిన ‘బాదుషా’ సినిమాలో శిoభు పాడిన ‘డైమండ్ గర్ల్’ పాటకు టాలీవుడ్ సినిమాలకు సంబంధించి బెస్ట్ మేల్ సింగర్ గా అవార్డును ఈరోజు అందుకుంటున్నాడు. అనేక మంది దక్షిణాది సినిమా రంగ ప్రముఖులు పాల్గొంటున్న ఈ ‘సీమ’ అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ సింగర్ అవార్డు అందుకోవడం చాల ఆనందంగా ఉంది అని అంటూ ఈ అవకాశం కలిగించిన జూనియర్ కు కృతజ్ఞతలు తెలియ చేసాడు శిoభు. అంతేకాదు ఈ అవార్డును మెగా స్టార్ చిరంజీవి అతిధిగా పాల్గొంటున్న ‘సీమ’ అవార్డ్స్ ఫంక్షన్ లో అందుకోవడం ఆనందకరమే అయినా పవన్ కళ్యాణ్ సినిమాకు పాట పాడాలన్న తన కోరిక తీరినప్పుడే, తనకు పూర్తి ఆనందం కలుగుతుంది అని అంటున్నాడు ఈ క్రేజీ హీరో. మరి పవన్ శిoభు కోరికను ఎప్పుడు మన్నిస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: