టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ఫాలోయింగ్ ని కలిగి ఉన్న హీరో రవితేజా. అలాంటి రవితేజాని ఓ స్టార్ హీరోయిన్ షూటుగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా మాస్ రాజా రవితేజా నటించిన పవర్ మూవీ బాక్సాపీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకొని, కలెక్షన్స్ కోసం తెగ కంగారు పడుతుంది. ఈ మూవీ పై భారీ అంచనాలను పెట్టుకొన్న రవితేజా, పవర్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే సరైన సక్సెస్ టాక్ రాకపోవడంతో కొద్దిగా నిరాశ పడ్డాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ స్టార్ హీరోయిన్ కి, ఓ దర్శకుడు కథని చెప్పాడంట. అయితే కథ విన్న తరవాత మూవీకి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హీరోయిన్ వెంటనే హీరో ఎవరు అని అడిగితే, అందుకు దర్శకుడు రవితేజా అని సమాధానం చెప్పాడంట. దీంతో హీరోయిన్ ఒక్కసారిగా సీరియస్ అయి, రవితేజా హీరోగా ఉంటే తను హీరోయిన్ గా చేయనని కచ్ఛితంగా చెప్పుకొచ్చిందట. దీంతో దర్శకుడు ఆ కథలో హీరోని మార్చి ఇప్పడు మరో హీరో కాల్షీట్స్ కోసం తిరుగుతున్నాడంట. ఇంతకీ ఆ దర్శకుడు ఏ హీరోయిన్ కి కథని చెప్పాడని ఆలోచిస్తున్నారా? ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు ఆ హీరోయిన్ హన్సిక అని అంటున్నారు. హన్సిక, రవితేజా ఇద్దరు కలిసి నటించిన చిత్రం పవర్ మూవీ. పవర్ మూవీలో బాక్సాపీస్ వద్ద సరైన సక్సెస్ గా నిలవకపోవడంతో హన్సిక మరోసారి రవితేజాతో నటించేందుకు ఆసక్తి చూడపడం లేదంట. అంతే కాకుండా పవర్ మూవీలో హన్సిక నటించినందుకు, తన రెమ్యునరేషన్ కూడ చాలా తక్కువనే అని అంటున్నారు. మొత్తానికి హన్సిక, రవితేజాని రిజెక్ట్ చేయడంతో, ఆ దర్శకుడు మరో హీరో కోసం ఇప్పటికీ వెతుకటం ఆపలేదంట.

మరింత సమాచారం తెలుసుకోండి: