మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే మూవీ ప్రస్తుతం విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మూవీతో రామ్ చరణ్ ప్యామిలీ ఆడియోన్స్ కి మరింతగా దగ్గరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. క్రియెటర్ క్రిష్ణవంశీ దర్శకుడిగా పూర్తి స్థాయిలో పనిచేసిన చిత్రంగా గోవిందుడు అందరివాడేలే మూవీని చెప్పుకుంటున్నారు. మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్స్, సాంగ్స్ ని చూస్తుంటే రామ్ చరణ్ టేస్ట్ కి భిన్నంగా, ఓ సరికొత్త స్టోరిని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీపై అటు క్రిష్ణవంశీ, ఇటు రామ్ చరణ్ ఎక్కువుగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తరువాత రామ్ చరణ్ మరో కొత్త మూవీలో నటించనున్నాడు. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు మాత్రం సీక్రెట్ గా ఉంచుతున్నారు. అయితే మెగా కాంపౌండ్ నుండి అందిన సమాచారం మేరకు రామ్ చరణ్ అప్ కమింగ్ ఫిల్మ్ లో చరణ్ కి జోడీగా హీరోయిన్ పాత్రలో సమంత నటించనుందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే సమంతని ఈ విషయంపై క్లారిటీ తీసుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. సమంత కూడ ఎప్పుటి నుండో రామ్ చరణ్ మూవీలో నటించాలంటూ తన మనస్సులోని మాటని బయటకు చెప్పుకుంది. అయితే ఎప్పుడో రామ్ చరణ్ సరసన నటించాల్సిన సమంత, తన బిజి షెడ్యూల్స్ కారణంగా ఇప్పటి వరకూ ఈ కాంబినేషన్ తెరపైకి రాలేదు. మొత్తానికి రామ్ చరణ్, సమంత ల కాంబినేషన్ ని చరణ్ తరువాతి మూవీలో మనం చూడబోతున్నాం అన్నమాట. అయితే సమంత మాత్రం తన రెమ్యునరేషన్ విషయంలో ఎంత మాత్రం తగ్గేది లేదంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: