మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు ఆసక్తి చూపిస్తుండటంతో, ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరిగి గ్లామర్ హడావిడి వేగం అందుకుంటుంది. స్టార్ హీరోల ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెగాస్టార్ నిజంగా మూవీని తీసి రిలీజ్ చేస్తే, నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న స్టార్ హీరోల కలెక్షన్స్ తో పాటు ధీటుగా తన మూవీని బాక్సాపీస్ వద్ద నిలబెట్టగలడా? అనే క్వశ్ఛన్స్ సైతం టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే వాటితో పాటు మెగాస్టార్ మూవీల కోసం ఫ్యాన్స్, అలాగే సాధారణం సినీ ప్రేక్షకులు సైతం ఒకింత ఆసక్తిని కనబరుస్తున్నారనేది కూడ నిజమే. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన గోవిందుడు అందరివాడే మూవీ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ మూవీని నిర్మించాలని పదే పదే కోరాడు. అందుకు మెగాస్టార్ సైతం ఇప్పుడు కాదు, 150వ ఫిల్మ్ తరువాత నిర్మిద్దామని మాట ఇచ్చాడు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బండ్ల గణేష్ తో ఓ భారీ బడ్జెట్ మూవీకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే 14 రీల్స్ పతాకం లోనూ చిరంజీవి ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా తన 150వ చిత్రంతోనే ఆగిపోకుండా చిరంజీవి వరుసగా మరో నాలుగు మూవీలు వరకూ తన షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నట్టు టాలీవుడ్ లో కథనాలు వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్, రామ్ చరణ్ మూవీ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవితో మూవీని తీయాలని కోరుకోవడంతో, అందుకు చిరంజీవి వెంటనే ఒప్పుకొని బండ్లగణేష్ తో భారీ బడ్జెట్ మూవీగా మెగా స్కెచ్ వేస్తున్నాడని ప్రస్తుత టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: