సల్మాన్ ఖాన్ రేంజ్ ముందు మహేష్ ను పోల్చడం సరియైన పోలిక కాదు. బాలీవుడ్ టాప్ హీరోల రేంజ్ లో ఎప్పుడో 200 కోట్ల క్లబ్ లో చేరిపోయిన సల్మాన్ సినిమాల ముందు మహేష్ సినిమాలు పోలికకు కుడా నిలబడవు. అయితే మహేష్ బాబు ‘ఆగడు’ సల్మాన్ ‘కిక్’ కు షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. బాలీవుడ్ మీడియా వార్తల మేరకు సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్' సినిమాకు అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్స్ కంటే ‘ఆగడు' సినిమాకు అమెరికాలో ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ అనే న్యూస్ సంచలనం గా మారింది.  వినపడుతున్న వార్తల ప్రకారం ప్రీమియర్ షోల ద్వారా కిక్ సినిమాకు 3 కోట్లు వస్తే ‘ఆగడు' సినిమాకు 3.50 కోట్లు వసూలు చేయడం సంచలనంగా మారింది. ‘దూకుడు' తరువాత ఎన్నో అంచనాలతో వచ్చిన శ్రీనువైట్ల, మహేష్ బాబు సినిమా కావడంతో అమెరికాలోని మన తెలుగు వారు అధిక ధర పెట్టి ప్రీమియర్ షోలోలు చూసేందుకు ఎగ పడటంతో ఆగడు సల్మాన్ కిక్ రికార్డు ను బ్రేక్ చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా ఆగడు తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తం గా 25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ ఈ స్థాయిలో రావడం మహేష్ స్టామినాను చూపెడుతోoదాని విశ్లేషకులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: