రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. కుటుంబ సినిమా కధగా రూపొందినా కృష్ణవంశీ మార్క్ రొమాంటిక్ సన్నివేశాలు చరణ్, కాజల్ ల మధ్య కొంచం మోతాదు మించి ఎక్కువగా ఉండటంతో’గోవిందుడు’ కు క్లీన్ సర్టిఫికేట్ కు బదులు U/A సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా సాంగ్స్ చిత్రీకరణ విషయంలో రొమాన్స్ పాలు కృష్ణవంశీ ఎక్కువగా పెట్టాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. అయితే కుటంబ బంధాలను తెలియ చెప్పే సన్నివేశాల చిత్రీకరణలో కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభ ప్రతి సన్నివేసంలోను స్పష్టంగా కనిపించిందని సెన్సార్ సభ్యులు కృష్ణవంశీని అభినందించినట్లు టాక్. అయితే ఈ సినిమా విడుదల తరువాత కొంత గ్యాప్ తీసుకుని కలుపుదాం అని అనుకుంటున్నా ఒక పాటకు సంబంధించిన ప్యాచ్ వర్క్స్ పెండింగ్‌ లో ఉన్నందున ఆ పాటను తరువాత సెన్సార్ చేయిస్తారు అని ఇన్‌సైడ్ టాక్. ఫిలిం వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గోవిందుడు 45 కోట్ల కలెక్షన్ మార్క్ ను అందుకుంటుంది అని ప్రచారం జరుగుతున్నా ‘గోవిందుడు’ కు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మైనస్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.  అయితే ఒకసారి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ చిన్న విషయాలు ఏమి ‘గోవిందుడు’ కు అడ్డుకావు అనే విశ్లేషణ కూడా ఉంది. ఏది ఏమైనా అక్టోబర్ 1న అన్నివిషయాలు తేలిపోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: