నందమూరి నటసింహం బాలక్రిష్ణ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన పనుల్లో బిజిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఓ పక్క పొలిటికల్ లైఫ్ ని సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తూ, మరో వైపు తన ఫిల్మ్ కెరీర్ ని కూడ సరైన ట్రాక్ లో నడిపిస్తున్నాడు. గతంలో బాలయ్య నటించిన లెజెండ్ మూవీ, తనకి సూపర్ డూపర్ సక్సెస్ ని ఇచ్చింది. అయితే ఈ మూవీలో బాలయ్య వాడిన వస్తువులను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. టాలీవుడ్ లో బాలయ్యబాబు స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేసి, తిరుగులేని విజయాన్ని అందించిన చిత్రాలలో లెజెండ్ ఒకటి. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ లను సంపాదించుకుంది. సింహా మూవీకి సీక్వెల్ గా వచ్చిన లెజెండ్ మూవీ సైతం బాక్సాపీస్ ని షేక్ చేసింది. బాలక్రిష్ణ పొలిటికల్ లైఫ్ ఎంట్రికి ముందుగా రిలీజ్ అయిన లెజెండ్ మూవీ అటు వివాదాస్పదంగానూ, ఇటు సన్షేషనల్ హిట్ గానూ క్రేజ్ ని సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాడిన బైక్ ని, టాటా సఫారీని వేలం వేయనున్నారు. బాలకృష్ణకి భారీ ఫాలోయింగ్ వున్న నేపధ్యంలో ఈ వస్తువులకు మంచి డిమాండ్ వుంటుందని ఆశిస్తున్నారు. లెజెండ్ మూవీ ప్రమోషన్ లో భాగంలో బాలక్రిష్ణ వాడిన బైక్ ని పలు ఏరియాల్లో ప్రదర్శన కోసం తిప్పారు. అలాగే ఆ బైక్ ని ప్రత్యేకంగా బాలక్రిష్ణ కోసం రెడీ చేశారు. ఆ విధంగా లెజెండ్ మూవీ బైక్ కి క్రేజ్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం బాలక్రిష్ణ అధికార పార్టీ హోదాలో పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తూ, అలాగే ఫాంలో ఉన్న హీరోగా టాలీవుడ్ లో తనదైన చాటుతుండటంతో, తను ఉపయోగించిన ఈ వస్తువులకి భారీగా డిమాండ్ ఉంటుందని వేలం నిర్హాకులు లెక్కలు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: