అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. తను నటించిన మనం మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించడం, తరువాత తను బుల్లితెరలో ప్రయోగాత్మకంగా చేసిన రియాలిటి షో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రేక్షక ఆధరణ పొందడం వంటివి నాగార్జునకి తెగ సంతోషాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే ఒక్కసారిగా పడిపోయిన తన బాక్సాపీస్ మార్కెట్ కూడ ఇప్పుడు మళ్ళీ ఫాంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే గతంలో తమ్మిడికుంట చెరువు స్థలాన్ని ఆక్రమించి ప్రవేట్ బిల్డింగ్ ని నిర్మించిన, నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన చర్యలు తీసుకునేందుకు అధికారులు శనివారం కూడా తమ్మిడికుంట చెరువుపై సర్వే నిర్వహించారు. దాదాపు రెండురోజుల పాటు నిర్వహించిన ఈ సర్వే సమగ్ర నివేదికను దసరా పండుగ తర్వాత సర్కారుకు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల క్రితం ఈ బిల్డింగ్ పై విభిన్న వాదనలు వినిపించాయి. చివరకు నాగార్జున ఈ బిల్డింగ్ కి సంబంధించిన సమస్యని, కె.సి.ఆర్ తో చర్చించుకొని పరిష్కరించుకున్నట్టుగా కథనాలు వచ్చాయి. అయితే తాజాగా జరిగిన వ్యవహారంతో ఈ సమస్య ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తుంది. గత మూడు నెలల క్రితం అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్టుల్లోని అక్రమ నిర్మాణాలపై మహానగర పాలక సంస్థ అధికారులు కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గురుకుల్ ట్రస్టు భూముల్లో నిర్మితమైన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన కూడా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యారు. ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించటంతో అధికారుల చర్యలకు బ్రేక్ పడింది. మొత్తానికి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెక్షన్ బిల్గింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి రానుందని అంటున్నారు. ఈ సమస్యని నాగార్జున ఏ విధంగా సాల్వ్ చేసుకుంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: