మెగా హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే. ఈ మూవీకి చాలా ప్రత్యేకలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ మొదటి సారిగా ఓ పూర్తి ఫ్యామిలీ ఓరియంటెడ్ కథాంశంలో నటిస్తున్నాడు. అలాగే కృష్ణవంశీ సైతం తను తెరకెక్కిస్తున్న చిత్రాలు అన్నీ బాక్సాపీస్ వద్ద ఘోర డిజాస్టర్స్ లు పొందుతుంటే, తన టాలెంట్ ని నమ్మి వచ్చిన అవకాశం ఈ గోవిందుడు అందరివాడేలే. కృష్ణవంశీ కి ఈ మూవీ సక్సెస్ అనేది దాదాపుగా సవాల్ లాంటిది అని ఫిల్మ్ ఇండస్ట్రీ భావిస్తుంది. అయితే ఈ మూవీ కచ్ఛితంగా డిజాస్టర్ అంటూ టాలీవుడ్ లో కొన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. అయితే గోవిందుడు అందరివాడేలే మూవీ అవుట్ పుట్ అనేది సూపర్బ్ గా వచ్చిందంటూ చాలా మంది చెబుతున్నారు. ఈ మూవీ రిలీజ్ తరువాత బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడం ఖాయం అని అనుకుంటే, అంత కంటే ముందుగా టాలీవుడ్ లో ఈ మూవీపై వస్తున్న న్యూమరిక్ టాక్స్ కొత్త విషయాలను చెబుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని యువ హీరోలను 8 సంఖ్య తీవ్రంగా భయపెడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ విషయంలో 8 నెంబర్ తీవ్ర నష్టాలను మిగిల్చింది. అలాగే ఇప్పుడు వస్తున్న రామ్ చరణ్ చిత్రం కూడ తనకి ఇది 8వ చిత్రం. టాప్ హీరోలు నటించిన 8వ చిత్రాలు అన్నీ డిజాస్టర్స్ గా నిలవడంతో, రామ్ చరణ్ నటించిన 8 వచిత్రం గోవిందుడు అందరివాడేలే కూడా, అటువంటి కోవలేకే వెళుతుందంటూ కొందరు లెక్కలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘జానీ'. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో పెద్ద ప్లాపు చిత్రంగా నిలిచింది. మహేష్ బాబు కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘నిజం'. ఇది డిజాస్టర్ గా నిలిచింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘ఆంధ్రావాలా' ఘోర డిజాస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 8వ సినిమా ‘వరుడు' పెద్ద డిజాస్టర్. నాగ చైతన్య కెరీర్లో వచ్చిన 8వ సినిమా ‘ఆటో నగర్ నగర్' ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్లో వస్తున్న 8వ సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే'. ఈ చిత్రం కూడ 8 వ సంఖ్య ఫలితాల ప్రకారం పరాభవం తప్పదని అంటున్నారు. అయితే రికార్డ్స్ ని బ్రేక్ చేసే సత్తా ఉన్న రామ్ చరణ్, ఈ డిజిట్ కి ఉన్న ఫియర్ ని తొలగిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: