కలర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. వారు ఫిల్మ్ కెరీర్ ని లీడ్ చేస్తున్న ప్రయాణంలో, చాలా పరిచయాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఆ పరిచయాలు ప్రేమగా, తరువాత పెళ్ళి గానూ మారుతుంటాయి. అయితే ఈ ప్రయాణంలో అవి సక్సెస్ ఫుల్ గా మారొచ్చు, లేక విషాదంగా మారొచ్చు. తాజాగా ఓ విషాద సంఘటన హీరోయిన్ భావన విషయంలో జరిగింది. మహాత్మ చిత్రంలో శ్రీకాంత్ సరసన నటించిన హీరోయిన్ భావన ని ఇన్నాళ్ళు ప్రేమ పేరుతో తన వెంట తిపుకొని బాగా వాడుకొని, ఇప్పుడు మాత్రం ఆమెకి హ్యాండిచ్చి మరో అమ్మాయితో పెళ్ళికి సిద్దం అయ్యాడు ఓ మహాను భావుడు. తనే మలయాళ నటుడు అనూప్ మీనన్. అనూప్ మీనన్ ప్రేమలో భావన పడ్డట్టు, ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాదిగా ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరి వ్యవహారం కూడ ఇంట్లో తెలిసి, పెద్దలు అందుకు అంగీకారం కూడ తెలిపినట్టు మీడియా పలుసార్లు కథనాలు వచ్చాయి. ఐతే భావనకు షాక్ ఇచ్చేలా, తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు, అనూప్ మీనన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. తనకు కాబోయే భార్య చిత్ర పరిశ్రమకు చెందినది కాదని అందులో వివరించాడు. ఇది జరిగి కొద్ది రోజులు అయింది. ఇప్పుడు భావన, ఆ హీరో పై ఛీటింగ్ కేసు పెట్టినట్టు మలయాళ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. తనని పెళ్ళి చేసుకోకపోతే అనూప్ మీనన్ పై కేసుని బలంగా తయారు చేస్తానని భావన గట్టిగా నిర్ణయించుకున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. భావన తీసుకున్న నిర్ణయంతో ప్రేమికుడు అయిన హీరో అనూప్ మీనన్ ఖంగుతిన్నాడు. ఈ సమస్య ఏ విధంగా ఓ కొలిక్కి వస్తుందో, ఇండస్ట్రీ వర్గాలకి ఆసక్తి కరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: