నాగార్జున తన కుమారుడు అఖిల్ హీరోగా నటించబోయే మొదటి సినిమా డైరెక్టర్ ఎంపిక విషయంలో అనుకోకుండా మహేష్ ప్రమేయానికి సంబంధించిన వార్తలు రావడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నాగ్ అఖిల్ సినిమాకు సంబంధించి ఇంచుమించు వినాయక్ ను ఎంపిక చేసినా ఇంకా నాగార్జునకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫై మోజు పోలేదు అనే మాటలు గట్టిగా వినపడుతున్నాయి. ఈ అభిప్రాయంతోనే నాగార్జున మళ్ళీ త్రివిక్రమ్ దగ్గర అఖిల్ సినిమాకు సంబంధించిన ఒత్తిడి పెంచి ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న అల్లుఅర్జున్ సినిమా పూర్తి అయ్యాక అయినా అఖిల్ సినిమాను మొదలుపెట్టడానికి అంగీకరిస్తే అప్పటిదాకా అఖిల్ సినిమా విషయం పై వెయిట్ చేస్తానని అంటూ వినాయక్ ప్రాజెక్ట్ విషయాన్ని పెండింగ్ లో పెడుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.  అయితే త్రివిక్రమ్ మాత్రం నాగ్ కోరికను సున్నితంగా తిరస్కరిస్తూ బన్నీ సినిమా పూర్తి అయ్యాక తనకు మహేష్ తో కమిట్ మెంట్ ఉందని అంటూ ఒకవేళ మహేష్ ఒప్పుకున్నా మహేష్ సినిమా నిర్మాత ఒప్పుకోడు కదా అని షాకింగ్ రిప్లై ఇచ్చాడని టాక్. అయితే ఇప్పటికే వచ్చే సంవత్సరం మహేష్ నటించే సినిమాల దర్శకుల ప్రాజెక్ట్స్ లో త్రివిక్రమ్ పేరు లేకుండా ఉన్నా తప్పించు కోవడానికి ఇలా త్రివిక్రమ్ మహేష్ పేరును ఎందుకు అడ్డు వేసుకున్నాడో నాగార్జునకు అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత ఒక మoచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్ చేయడం కోసo చూస్తూ త్రివిక్రమ్ ను తనకోసం ఒక సినిమా చేసి పెట్టమని ప్రభాస్ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే ప్రభాస్ కోరికకు త్రివిక్రమ్ నాగ్ కు ఇచ్చిన మహేష్ రిప్లైనే రిపీట్ చేస్తాడా లేదంటే మరో హీరో పేరు ముందుకు తేస్తాడా అనే విషయం రానున్న రోజులలో తేలుతుంది అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: